చర్మ సమస్యలకు చెక్ పెట్టాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

సోమవారం, 16 మార్చి 2015 (17:49 IST)
చర్మ వ్యాధులు అశుభ్రత, వంశపారంపర్యంగా వస్తాయి. వీటికి విటమిన్ లోపమే కారణమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చర్మ సమస్యలను దూరం చేసుకోవాలంటే సిట్రస్ ఫ్రూట్స్ ఆరెంజ్, లెమన్ రసాన్ని పూతలా వేసుకుంటే ఫలితం ఉంటుంది. 
 
చర్మ సమస్యలను దూరం చేసుకోవాలంటే.. నిమ్మరసం, క్యాబేజీ ఆకులు, ఆరెంజ్, టమోటా, ఆపిల్ జ్యూస్, ఆకుకూరలను రోజువారీ డైట్‌లో చేర్చుకోవాలి. విటమిన్ బి2, బి6 లోపంతో చర్మ సమస్యలు ఏర్పడుతాయి. అయొడిన్, బి12, రక్తప్రసరణ తగ్గినట్లైతే చర్మ సమస్యలు తప్పవు. వీటికి పరిష్కారం.. ఆహారంలో మార్పులేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఎండుద్రాక్ష, పండ్లు, కాయగూరలు, పాలు, వెజ్ ఆయిల్, వేరుశెనగ నూనె, ఫ్రూట్ కేసరి, బ్రెడ్ చపాతీ, తోటకూర వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. విటమిన్ బి12 అధికం గల ఆహారాన్ని తీసుకోవడం ద్వారా చర్మ సమస్యలను నయం చేసుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి