వర్షాకాలం.. విరేచనాలకు విరుగుడు క్యారట్ సూప్!

శనివారం, 25 అక్టోబరు 2014 (13:41 IST)
అసలే వర్షాకాలం.. బ్యాక్టీరియా వ్యాపించడంతో జలుబు, దగ్గుతో పాటు విరేచనాలు వంటి రుగ్మతలతో కష్టాలు తప్పవు. విరేచనాలు ఇబ్బంది పెడుతుంటే.. క్యారెట్ సూప్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శరీరం కోల్పోతున్న పొటాషియం, సోడియం, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియంతో పాటు పెక్టిన్‌ని కూడా క్యారెట్ అందిస్తుంది. 
 
పేగులో పెరుగుతున్న హానికర బ్యాక్టీరియాను క్యారెట్ సూప్ తగ్గిస్తుంది. అరకిలో క్యారెట్ ముక్కలను 150 మి.లీ. నీటిలో మరిగించాలి. ముక్కలు మెత్తబడిన తర్వాత గుజ్జుగా తయారవుతాయి. అప్పుడు దీనిని వడకట్టాలి. దీనికి ఒకస్పూన్ ఉప్పు జతచేసి అరగంటకోసారి ఒకటి రెండు గిన్నెలు పట్టగలిగితే విరేచనాలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి