మొక్కజొన్న గింజలలో మినరల్స్ అధికం. మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్ వంటివి కూడా వీటిలో వుండి ఎముకలు గట్టిపడేలా చేస్తాయి. మొక్కజొన్నలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. నిత్యయవ్వనులుగా ఉంచుతాయి.
రక్తహీనతకు చెక్ పెడుతుంది. స్వీట్ మొక్కజొన్న విటమిన్ ప్లస్ ఫోలిక్ యాసిడ్లు కలిగివుండటంతో రక్తహీనతను దూరం చేస్తుంది. అలాగే పెద్ద పేగు క్యాన్సర్‌ను దరిచేరనివ్వదు. కిడ్నీ, హృద్రోగ సమస్యల నుంచి మొక్కజొన్న రక్షిస్తుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ని నివారించడానికి సహాయపడుతుంది.