జింజర్ టీతో జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుకోండి!

మంగళవారం, 17 మార్చి 2015 (19:36 IST)
జింజర్ టీతో జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుకోండి అంటున్నారు... ఆరోగ్య నిపుణులు. జింజర్ టీ జీర్ణవ్యవస్థను ఉత్తేజపరుస్తుంది జింజర్ యాంటీ ఆక్సిడెంట్‌లతో నిండి ఉండి, తద్వారా శోషణ, ఆహార పోషకాల సమీకరణంలో కీలక పాత్రను పోషించి తద్వారా జీర్ణక్రియకు సహాయపడతాయి. 
 
ఇది ఆహారంలో ఉండే ప్రోటీన్లను కూడా తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అజీర్తి లేదా ఎసిడిటీతో బాధపడుతుంటే తక్షణ ఉపశమనానికి ఒక కప్పు జింజర్ టీ తాగితే సరిపోతుంది. తరచూ వ్యాధుల బారిన పడకుండా మఏనల్ని కాపాడుటకు రోగనిరోధకశక్తిని పెంచేందుకు జింజర్ టీ ఎంతగానో ఉపయోగపడుతుంది.  
 
ఒక చిన్న అల్లం ముక్క తీసుకుని, కడిగి తొక్కు తీయండి. ఇప్పుడు, దానికి చిన్న ముక్కలుగా కోయండి లేదా తరగండి. ఈ జింజర్ ముక్కలను మరుగుతున్న ఒక కప్పు నీటిలో వేసి పది నిమిషాల తర్వాత తీసేస్తే జింజర్ టీ రెడీ అయినట్లే. జింజర్ టీని రోజుకో కప్పు తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి