యాంటీ ఏజింగ్ ఎలిమెంట్‌గా పనిచేసే గ్రేప్ జ్యూస్!

శనివారం, 24 జనవరి 2015 (15:51 IST)
గ్రేప్ జ్యూస్ యాంటీ ఏజింగ్ ఎలిమెంట్‌గా పనిచేస్తుంది. ద్రాక్షరసం ఎక్స్ ఫ్లోట్ కు సహాయపడుతుంది. నిజానికి, చర్మంపై ద్రాక్ష రసం వంటకాలను రాస్తే ఎక్స్ ఫ్లోట్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. చర్మంతో పాటు ఉండే డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించుటకు, ముడుతలను తగ్గించడం చేస్తుంది.
 
రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతేకాక చర్మం స్థితిస్థాపకత ఉత్తమంగా ఉంటుంది. చర్మం హైడ్రేట్ అయితే ద్రాక్షరసం సహజంగా చర్మాన్ని తేమగా ఉంటుతుంది. 
 
ముఖానికి ఒక టేబుల్ స్పూన్ ద్రాక్ష రసం రాసి,15 నిముషాల తర్వాత వెచ్చని నీటితో కడగాలి. అప్పుడు చర్మం తేమగా ఉంటుంది. కళ్లచుట్టూ డార్క్ వలయాలతో చూడటానికి అసహ్యకరంగా ఉన్నాయా? విత్తనాలు లేని ద్రాక్షను తీసుకుని కట్ చేసి కనురెప్పల మీద ఉంచాలి. ఈ విధంగా చేయుట వలన కళ్ళ చుట్టూ చర్మం మెరుగుపరచడానికి డార్క్ వలయాలను తగ్గించటానికి సహాయపడుతుంది.
 
ఒక స్పూన్ ద్రాక్ష రసం మరియు ఒక చెంచా గుడ్డు తెల్ల సొన కలిపి మీ ముఖం మీద రాయాలి. ముఖంను కడగటానికి ముందుగా పదినిమిషాలయ్యాక కడిగేస్తే సరిపోతుంది. 

వెబ్దునియా పై చదవండి