కాఫీకి స్వస్తి చెప్పండి.. గ్రీన్ టీ తాగండి. ఇలా గ్రీన్ టీ డైట్ చేస్తే తప్పకుండా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాఫీ, హార్ట్ హెల్త్‌కు చాలా ఆరోగ్యకరమైనా, గ్రీన్‌టీ మరింత ఉత్తమమైనది. ఇది మిమ్మల్ని చురుగ్గా ఉండేలా చేస్తుంది.
గ్రీన్ టీ కార్బోహైడ్రేట్స్‌ను మెల్లగా విడుదల చేస్తుంది, బ్లడ్ షుగర్ లెవల్స్‌ను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. దీనివల్ల శరీరంలో కొవ్వు చాలా సులభంగా కరిగిపోతుంది. కాబట్టి, త్వరగా బరువు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.