ఆరోగ్యంతో పాటు సన్నబడాలంటే ఏం తీసుకోవాలి?

సోమవారం, 5 జనవరి 2015 (14:39 IST)
ఇంట్లోనే సహజంగా శరీరానికి హాని కలిగించే వాటిని తొలగించే విధానాలలో పండ్లను ఆహారంగా తీసుకోవాలి. పండ్లను అధికంగా తీసుకోవడం ద్వారా సన్నబడతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
 
టీ, పండ్ల రసం, నీరు లేదా షేక్స్ వంటి ద్రవపదార్థాలు తీసుకోవాలి. దీంతో డెటాక్సిఫై నుంచి తప్పించుకోవడంతో పాటు ఒబిసిటీని దూరం చేసుకోవచ్చునని న్యూట్రీషన్లు సలహా ఇస్తున్నారు. 
 
రోజుకి కనీసం ఎనిమిది గ్లాసుల నీరు త్రాగేలా చూసుకోవాలి. ఈ విధంగా త్రాగటం వలన శరీరం నుండి అన్ని మలినాలు బయటకు నెట్టివేయటానికి సహాయపడుతుంది. ఎక్కువ మోతాదులో చక్కెర కానీ, ఉప్పు కానీ వాడకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి