ఆఫీసును గుమ్మం దగ్గర, ఇంటిని ఆఫీసు దగ్గర...?

శనివారం, 20 డిశెంబరు 2014 (14:39 IST)
ఆలుమగలు ఉద్యోగం చేస్తున్నారా? ఈ టిప్స్ పాటించండి! అంటున్నారు మానసిక నిపుణులు. ఇంట్లో చేయాల్సిన పనులను సమానంగా పంచుకోండి. ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే వారి పని మీరు చేయండి. ఒకరు పని చేస్తుంటే మరొకరు టీవీ చూడటమో, పాటలు వినడమో కాకుండా వారికి పనిలో మీ వంతుగా సహాయపడితే మరీ మంచిది. ఆఫీసు పనిభారంతో ఇంటికివచ్చి, అసహనంతో మాట తూలితే.. వెంటనే సారీ చెప్పడం మరవకండి. 
 
ఆఫీసును గుమ్మం దగ్గర, ఇంటిని ఆఫీసు దగ్గర వదలడానికి ప్రయత్నించండి. ఆఫీసు పని భారం అనుకోకండి. చురుకుగా చలాకీగా చేయడానికి ప్రయత్నించండి. అలాగే చలాకీదనం ఇంట్లోనూ ప్రదర్శించండి. ఆఫీసుకే అంకితమైపోతున్నానని బాధపడకుండా నెలవారీ క్యాలెండర్ ఒకటి తయారు చేసుకోండి. సెలవు రోజుల్లో పిల్లలతో ఎక్కడికి వెళ్లాలి, ఏ సినిమాకు వెళ్లాలి, బంధువులను ఎవరిని కలవాలి.. ఇలాంటి విషయాలను రాసుకోండి.

వెబ్దునియా పై చదవండి