ఎప్పుడూ ఆకలేయట్లేదా..? తినబుద్ధి కావట్లేదా?

మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (16:24 IST)
మధ్యాహ్నం ఫుల్‌గా లాగించి రాత్రి పూట ఆకలేయలేదని చెప్తే పర్లేదు. కానీ ఎప్పుడూ ఆకట్లేయకుండా... తినబుద్ధి కావట్లేదంటే మాత్రం ఏదో సమస్య ఉందని గ్రహించాలి. 17-22 ఏళ్ల లోపు గల యువతీయువకుల్లో, 60 ఏళ్లు దాటిన వృద్ధుల్లో ఆకలిలేమి సమస్య తప్పదని న్యూట్రీషన్లు అంటున్నారు. ఐరన్, విటమిన్ బి6  వంటివి విటమిన్స్ లోపించడంతోనే ఆకలి లేమి సమస్య ఏర్పడుతుంది. 
 
అలాగే కొన్ని మందుల్ని వాడటం ద్వారా కూడా ఆకలిలేమి సమస్య ఉత్పన్నమవుతుంది. అంతేగాకుండా మానసిక ఒత్తిడి, మానసికాందోళన వంటి సైకలాజికల్ సమస్యల వల్ల కూడా ఆకలిలేమి ఏర్పడుతుంది. తింటే బరువెక్కిపోతామనే వారిలో అనోరిగ్జియా సమస్య ఉంటుందని.. దీన్ని కౌన్సిలింగ్ ద్వారానే సరిచేయడం కుదురుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆకలేయట్లేదని చెప్పడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం వంటివి చేస్తే తప్పకుండా వైద్యుల్ని సంప్రదించడం మంచిదని వారు సూచిస్తున్నారు.
 
అలా కాకుంటే ఆహారంలో వెరైటీని ట్రై చేయండి. న్యూట్రీషన్స్ నిండిన నట్స్ అప్పుడప్పుడు తినేలా చేయండి. మాంసం, గుడ్లు, చేపలు, కూరగాయలన్ని డైలీ డైట్‌లో చేర్చుకోండి. ఇవి చేర్చినా ఆకలి లేమి వేధిస్తే.. తప్పకుండా వైద్యుల్ని సంప్రదించాల్సిందే. 

వెబ్దునియా పై చదవండి