మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే.. వాల్ నట్స్ తీసుకోండి!

గురువారం, 29 జనవరి 2015 (14:18 IST)
ఆలోచనలు, జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉండాలంటే మెదడు చురుకుగా పని చేయాలి. మెదడు చురుకుగా పనిచేయాలంటే మెదడులోని నాడీకణాల మధ్య సమాచార మార్పిడి వేగంగా జరుగుతుండాలి. అటువంటి సమాచార మార్పిడి వేగం నాడీకణాల ఆరోగ్యంతో వస్తుంది. 
 
ఇందుకు ఒమేగా-3 ఫ్యాటీ ఏసిడ్స్ కావాలి. ఆ తరహా ఫ్యాటీ ఏసిడ్స్‌ని సమృద్ధిగా అందించగలిగేవి వాల్ నట్స్, ఎండు పళ్ళుగా లభించే వీటి రూపం మెదడు రూపానికి దగ్గరగా ఉంటుందంటారు. ఇవి మెదడు చురుగ్గా పనిచేసేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి