పుస్తకం చదవండి.. అల్జీమర్‌ను దూరం చేసుకోండి!

శనివారం, 20 డిశెంబరు 2014 (13:29 IST)
పుస్తకం చదవండి.. అల్జీమర్‌ను దూరం చేసుకోండి! అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాత్రివేళ ఏడు గంటలపాటు నిద్రపోవడంతో పాటు పుస్తకాలు పఠించడం అనే మ్యాజిక్ ఫార్ములా వల్ల వృద్ధులు మానసికంగా ఆనందంగా ఉండగలుగుతారని తాజా అధ్యయనంలో తేలింది. 
 
65 ఏళ్ల వయసు పైబడిన 245 మంది వృద్ధిల జీవనశైలిని స్పెయిన్ శాస్త్రవేత్తలు విశ్లేషించగా పుస్తక పఠనం లాంటి అలవాట్ల వల్ల వృద్ధుల మెదడు చురుకుగా పనిచేస్తుందని తేల్చారు. వృద్ధాప్యంలోనూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుందని గుర్తించారు. 
 
సరైన నిద్ర, పుస్తక పఠన అలవాట్లు, వ్యాయామం వల్ల వృద్ధాప్యంలో అల్జీమర్ లాంటి మతిమరుపు వ్యాధులను దూరం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి