ఎరుపు అరటితో కంటివ్యాధులకు చెక్ పెట్టండి!

సోమవారం, 1 సెప్టెంబరు 2014 (17:01 IST)
ఎరుపు రంగు అరటిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అమెరికాలో పండే ఈ పండ్లలోని బీటా కరోటిన్ కంటి వ్యాధులను దూరం చేస్తుంది. ఎరుపు అరటిలో హై పొటాషియం ఉంది. ఇది కిడ్నీలోని రాళ్లు చేరకుండా నివారిస్తుంది. విటమిన్ సి, ఆంటి యాక్సిడెంట్లు, 50 శాతం పీచు పదార్థాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. 
 
రేచీకటితో బాధపడుతున్న వారు రాత్రి భోజనానికి తర్వాత 40 రోజుల పాటు ఎరుపు అరటిని తీసుకుంటే ఈ వ్యాధి నయం అవుతుంది. దంత సమస్యలను దూరం చేసుకోవాలంటే రోజూ ఒక ఎరుపు అరటిని తీసుకోవాలి. అలాగే చర్మ వ్యాధులు, అలెర్జీలకు కూడా ఎరుపు అరటి దివ్యౌషధంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి