సుఖ నిద్రకు చిట్కాలేంటి?

మంగళవారం, 22 జులై 2014 (17:15 IST)
క్రమం తప్పకుండా నిర్ణీత వేళల్లోనే నిద్రకు ఉపక్రమించాలి. సాయంకాల సమయాల్లో కునికిపాటుకుదూరంగా ఉండాలి. ఆరోగ్యం ఉండేందుకు మాత్రమే కాకుండా సుఖ నిద్రకు కూడా వ్యాయామం చేయాలి. అయితే, నిద్రకు ఉపక్రమించే ముందుగా ఎలాంటి వ్యాయామాలు చేయరాదు. నిద్రపోయే ముందు ఎలాంటి కాఫీ, టీ, శీతలపానీయాలు సేవించరాదు. 
 
వీలైనంత మేరకు రాత్రిపూట మిత ఆహారం మాత్రమే తీసుకోవాలి. మరీ ఎక్కువ ఆకలిగా ఉంటే తేలిక పాటి ఆహారం మాత్రమే తీసుకోవాలి. పగటి వేళ పని వేళలను సహేతుకంగా నిర్ణయించుకోవాలి. పడకపైకి చేరడానికి అర్థగంట ముందుగా విశ్రాంతిగా ఉండటానికి ప్రయత్నించడం, పుస్తక పఠనం, ధ్యానం, కొద్దిపాటి నడక మంచి నిద్రకు ఎంతగానో ఉపయోగపడతాయి. 

వెబ్దునియా పై చదవండి