రోజాపువ్వుల్లోని ఆరోగ్య రహస్యాలేంటో తెలుసా?

మంగళవారం, 15 జులై 2014 (17:39 IST)
రోజాపువ్వంటే అందరికీ ఇష్టమే. రోజా పువ్వులోనూ ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఉదరంలోని వాయురోగాలను రోజా పువ్వు నయం చేస్తుందట. ఇంకా గుండెను పటిష్టం చేయడంలోనూ రోజా పువ్వు ఎంతోగానో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజా రెక్కలు శరీర ఉష్ణాన్ని తగ్గిస్తాయి. మహిళలకు గర్భసంచిలో ఏర్పడే రుగ్మతలను దూరం చేస్తాయి.  
 
ఒక కప్పు రోజా రెక్కలను ఒక పాత్రలో వేసి ఒక గ్లాసు నీరు పోసి మరిగించి.. తర్వాత వడగట్టి అందులో సగం కషాయాన్ని పంచదారతో కలుపుకుని ఉదయం పూట, మిగిలిన సగం సాయంత్రం పూట తీసుకుంటే ఉదర రుగ్మతలను దూరం చేస్తుంది. ఈ కషాయం వాంతులను కూడా నయం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. 
 
ఇంకా రోజ్ వాటర్‌ను 3-4 డ్రాప్స్ స్నానం చేసే నీటిలో కలుపుకుని స్నానం చేస్తే కోపం, ఒత్తిడిని దరిచేరనివ్వదు. అలెర్జీలను నయం చేస్తుంది. ఆస్తమాను దూరం చేస్తుంది. 

వెబ్దునియా పై చదవండి