పళ్లు ఊడిపోతే.. మెమరీ పవర్ తగ్గిపోతుందట...!

శుక్రవారం, 19 డిశెంబరు 2014 (13:12 IST)
యువత, వృద్ధాప్యం ఉన్నవారికి మెమరీ పవర్ తేడా ఉంటుంది. వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి తగ్గిపోవడానికి కారణమేమిటనే దానిపై తాజాగా నిర్వహించిన పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. వృద్ధాప్యంలో పళ్లు ఊడిపోవడం జ్ఞాపకశక్తి, శరీర సామర్థ్యంలో ప్రభావం చూపుతుందని లండన్ యూనివర్శిటీ కాలేజ్‌కు చెందిన రచయిత జార్జియస్ సకోస్ యూ తెలిపారు.
 
60-74 సంవత్సర వృద్ధుల్లో శరీరంలో శక్తి సామర్థ్యాలు, జ్ఞాపకశక్తి తగ్గేందుకు దంతవ్యవస్థ దెబ్బతినడమే కారణమని జార్జియస్ చెప్పారు. ఈ పరిశోధన 60 సంవత్సరాలు గల 3,166 మందిపై జరపడింది. వారి నడక వేగం అలాగే జ్ఞాపకశక్తి ఆధారంగా జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఈ కథనం జర్నల్ ఆఫ్ ది అమెరికా గెరియాట్రిక్స్ సొసైటీలో ప్రచురితమైంది. 

వెబ్దునియా పై చదవండి