రోజుకు ఒకటి కాదు.. రెండే రెండు యాపిల్ ముక్కలు తింటే?

శుక్రవారం, 19 డిశెంబరు 2014 (14:23 IST)
రోజుకు ఒక యాపిల్ కాదండీ.. రెండే రెండు యాపిల్ ముక్కలు తీసుకుంటే ఒత్తిడిని దూరం చేసుకోవచ్చునని తాజా అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా మధ్య వయస్సులో ఉన్న మహిళలు ఒత్తిడికి చెక్ పెట్టాలంటే తప్పనిసరిగా రోజుకు రెండే రెండు యాపిల్ ముక్కలు తినాల్సిందే అంటున్నారు పరిశోధకులు. 
 
6వేల మంది ప్రజలు పాల్గొన్న ఈ పరిశోధనలో కెమికల్స్ కలిగిన పదార్థాల కంటే.. రోజుకు రెండు ముక్కలు లేదా ఒక ఆపిల్ తీసుకునే వారిలో ఒత్తిడి లేనట్లు తేలింది. ఆపిల్ తీసుకునే వారిలో ఒత్తిడి లక్షణాలు చాలా తక్కువగా నమోదైనట్లు యూనివర్శిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్ ప్రొఫెసర్ గీతా మిశ్రా ఓ టీవీ ఛానల్‌తో అన్నారు. 
 
ఇంకా తాజా పండ్లు కూరగాయలు తీసుకునే వారిలో శరీరానికి కావలసిన యాంటీ-ఇన్ఫ్లామేటరీ కాంపౌండ్స్, యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయని మిశ్రా చెప్పారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ఆస్ట్రేలియన్ సైంటిస్ట్స్‌లో ప్రచురితమైంది. 

వెబ్దునియా పై చదవండి