అలసటను దూరం చేసుకోవాలంటే ఏం చేయాలి?

మంగళవారం, 17 జూన్ 2014 (14:28 IST)
ఎక్కువ సమయం పనిచేస్తున్నారా? అలసిపోతున్నారా? అందుకు ఇవే కారణాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలసట అనేది జీవన క్రియే. అయితే ఎటువంటి శారీరక శ్రమలేకుండా, ఎటువంటి శక్తిని ఉపయోగించకుండానే, అనవసరంగా ఎప్పుడూ అలసటకు గురిఅవుతుంటే, అప్పుడు మీలో ఆరోగ్యపరంగా సమస్యలున్నట్లు గుర్తించాలి. 
 
చాలా హార్డ్‌గా పనిచేస్తున్నా శక్తి లేకపోవడంతో అలసటకు గురవుతారు. ఇంకా అధిక ఒత్తిడి కూడా అలసటకు దారి తీస్తుంది. అయితే అలసటను దూరం చేసుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేంటంటే... 
 
* అల్పాహారం తప్పకుండా తీసుకోవడం.. 
అల్పాహారాన్ని దాటవేస్తే ఎనర్జీ తగ్గడంతో పాటు అలసట తప్పదు.  
*  నీరు ఎక్కువగా తీసుకోవాలి.
* జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకూడదు. 
* వ్యాయామం చేయడం 
* ఎక్కువ గంటలు నిద్ర పోకూడదు. రాత్రి 8 గంటల నిద్ర, పగటిపూట వీలైతే 1 గంట నిద్రపోతే సరిపోతుంది.  
* ఒత్తిడికి లోనుకాకుడదు. అప్పుడేఅలసటకు 
 
షన్: కొన్ని సందర్భాల్లో అలసట అనేది మనస్సుకు సంబంధించినది. మీ మనస్సు ఎలా చెబితే అలా మీరు ఫీలవుతారు. మీరు ఎటువంటి శారీరక శ్రమ లేదా ఏ పనిచేయకుండా డిప్రెషన్ లో ఉన్నప్పుడు మీరు ఎప్పుడూ అలసటకు గురైనట్లు అనిపిస్తుంది.
 
విటమిన్ బి12లోపం: మీరు శాఖాహారులైతే, అప్పుడు ఖచ్చితంగా మీరు బి12 లోఫంతో బాధపడే అవకాశం ఉంది. ఎందుకంటే బి12విటమిన్ కేవలం అనిమల్ పుడ్స్ ద్వారానే అందుతుంది. ఈ పోషకాంశాలు నరాలు మంచి ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతాయి. 
 
నిద్రలేమి: మీరు ప్రతి రోజూ సమయానికి నిద్రిస్తున్నా, మంచి నిద్రను పొందకపోవడం వల్ల లేదా కలత నిద్రవల్ల ఒత్తిడి లోనవ్వాల్సి వస్తుంది. ఈ నిద్రలేమి అసౌకర్యం వల్ల కూడా అలసటకు గురికావల్సి వస్తుంది.

వెబ్దునియా పై చదవండి