చాలామంది రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఏసీ గుదుల్లోనే ఉంటుంటారు. అది వేసవి కాలమైనా.. శీతాకాలమైనా సరే. అదేపనిగా ఏసీలో ఉన్నట్టయితే అనారోగ్య సమస్యలు తలెత్తే ఆస్కారం ఉన్నట్టు వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆ సమస్యలేంటో ఇపుడు తెలుసుకుందాం.
* పొద్దస్తమానం ఏసీలో ఉండటం వల్ల శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. ముక్కు, గొంతు, కళ్లు ఇన్‌ఫెక్షన్‌కు గురవుతాయి.
* గొంతు పొడిబారిపోతుంది. ముక్కు రంధ్రాలు పూడుకుపోతాయి.
* ఆస్తమా, అలర్జీలు ఉన్నవారు ఏసీల్లో అస్సలు ఉండరాదు. లేదంటే సమస్య మరింత ఎక్కువవుతుంది.