మద్యపానాన్ని ఒకటి రెండు గ్లాసులకు పరిమితం చేసుకుంటే టెస్టోస్టీరాన్ హార్మోన్ స్థాయి పడిపోకుండా నివారించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే మెనోపాజ్ దశలో పురుషుల్లో ఒత్తిడిని నివారించాలి. మానసిక, శారీరక ఒత్తిడి టెస్టోస్టీరాన్ స్థాయిని త్వరగా కృంగదీస్తుంది. అకస్మాత్తుగా కార్టిసాల్ పెరగడానికి ఒత్తిడి కారణమవుతుంది. ఇది టెస్టోస్టీరాన్ను తయారుచేసే కణజాలంలో ఉపయోగించే శరీర శక్తిని అణిచివేస్తుంది.
టెస్టోస్టీరాన్ హార్మోన్ స్థాయి మద్యపానం వల్ల తగ్గిపోవడంతో లైంగిక శక్తి తగ్గడం, గుండెజబ్బులు రావడం, ఎముకలు బలహీనం కావడం వంటి పరిస్థితులు దాపరిస్తాయి. ఆందోళన, ఒత్తిడి అధిగమించాలంటే నడవడం, పరిగెత్తడం, ఈతకొట్టడం, వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.