బంగాళాదుంపలు ఆరగిస్తే గర్భిణులకు మధుమేహం వస్తుందా?

బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (11:08 IST)
సాధారణంగా బంగాళాదుంపలను ఇష్టపడని వారుండరు. అన్ని వయస్సుల వారు, ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో ఆరగిస్తూనే ఉంటారు. అయితే, వీటిని ఎక్కువగా ఆరగిస్తే కడుపులో గ్యాస్ సమస్యలు ఉత్పతన్నమవుతాయి. వీటితో పాటు మధుమేహం వ్యాధి కూడా సోకుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా, గర్భవతులు ఎక్కువగా బంగాళదుంపలు తింటే మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందంటున్నారు. 
 
అంతేకాకుండా దీని ప్రభావం పుట్టుబోయే బిడ్డలపై కూడా ఉంటుందని అమెరికాలోని హ్యూస్టన్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్‌‌కు చెందిన నిపుణులు హెచ్చరిస్తున్నారు. 1991 నుంచి 2001 వరకూ సుమారు 15 వేల మంది మహిళలపై చేసిన ఒక అధ్యయనంలో ఈ విషయాన్ని నిర్ధారించారు. 
 
బంగాళదుంపలు ఎక్కువగా తినటం వల్ల తల్లి ఒంట్లో గుక్లోజ్‌ స్థాయి మామూలు కన్నా వేగంగా పెరుగుతుందని, దీని వల్ల మధుమేహ సమస్య ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. బంగాళాదుంపతో పాటుగా ఇతర కూరగాయలు తినేవారిలో మధుమేహం వచ్చే అవకాశం తక్కువని కూడా ఈ అధ్యయనంలో తేలింది. 

వెబ్దునియా పై చదవండి