చలి కాలంలో చర్మం దురదగా ఉంటే...

బుధవారం, 3 ఫిబ్రవరి 2016 (12:04 IST)
సబ్బులు, పెర్‌ఫ్యూమ్‌ల వాడకం, చమట.. ఇలా రకరకాల కారణాల వల్ల చలికాలంలో చర్మం దురదపెడుతుంటుంది. ఈ సమస్యను తగ్గించాలంటే ఈ చిట్కాలు పాటించాలి. లవంగం, తులసి, ఆవనూనె, ఆలివ్ఆయిల్, నువ్వులు నూనె, కొబ్బరినూనె.. మొదలైన నూనెలలో ఏదైనా ఒకనూనెను తీసుకొని శరీరానికి పట్టించి, మర్దనా చేసి వెచ్చని నీటితో స్నానం చేయాలి.వెంటనే మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి. రోజూ ఇలా చేస్తే సమస్య తగ్గుముఖం పడుతుంది. 
 
రాత్రి పడుకునే ముందు చేతులకి, కాళ్ళకి, మోచేతులకు నూనె రాసి ఆ భాగం కవర్ అయ్యేలా సాక్స్ ధరిస్తే చర్మానికి దురద సమస్య ఉండదు. చర్మంలోని దురద తగ్గడానికి బకెట్ నీటిలో టీ స్పూన్ నిమ్మరసం కలిపి స్నానం చేయాలి. 

వెబ్దునియా పై చదవండి