బాదం టీ తాగారా? బాదం టీ ప్రయోజనాలు ఏమిటి?

సోమవారం, 4 జులై 2022 (23:24 IST)
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే బాదం టీ తాగండని నిపుణులు చెపుతుంటారు. శరీరంలో మంట సమస్యను తగ్గించే శక్తి బాదం టీకి వుంది. కీళ్ల నొప్పులలో ఉపశమనం ఇస్తుంది. శరీర జీవక్రియను కూడా సరిగ్గా ఉంచుతుంది. రోజూ బాదం టీ తాగడం వల్ల కిడ్నీ సక్రమంగా పనిచేసి కిడ్నీ సమస్యలు తగ్గుతాయి. బాదం టీ కిడ్నీ సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

 
గుండె ఆరోగ్యంగా ఉండటానికి, శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో బాదం టీ ఉపయోగపడుతుంది. క్రమంతప్పకుండా బాదం టీ తాగడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది కాకుండా బాదం టీ శరీరం అలసట, బలహీనతను తొలగిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు