చాలా మంది ఆరోగ్యంగా ఉంటారు. మూడు పూటల పుష్కలంగా ఆహారం ఆరగిస్తుంటారు. కానీ, అలసట, నిస్తేజం ఆవరించినట్టుగా ఉంటుంది. ఇలా ఎందుకు ఉంటుందో వారికి అర్థంకాదు. ఇదే అంశంపై వైద్యులను సంప్రదిస్తే,
* ప్రతిరోజూ ఉదయం పూట అల్పాహారం మానేస్తే, నిద్ర మత్తు నుంచి మేల్కొలిపే కాఫీలాంటి ఉత్ర్పేరకాల మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కెర స్థాయిలను సమంగా ఉంచుకునేలా ఉదయం అల్పాహారం తప్పనిసరిగా తినాలి.
* రాత్రి నిద్రకు ముందు మొబైల్, టీవీ, వీడియో గేమ్స్ వంటి ఉపకరణాల వాడకం వల్ల మెదడు చైతన్యవంతంగా ఉండి నిద్ర రానివ్వదు. ఫలితంగా పగటి వేళంతా నీరసంగా ఉంటాం. కాబట్టి ఈ ఉపకరణాలను పడగ్గదిలోకి అనుమతించకూడదు.