మధుమేహం వ్యాధితో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. దీనికి శాశ్వత పరిష్కారం లేదు. అయితే కొన్ని ఆహార నియమాలను పాటించడం ద్వారా దానిని నియంత్రించవచ్చు. ఈ వ్యాధికి ఆవాలు దివ్యౌషధంగా పని చేస్తాయి. వీటితో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కప్పు ఆవాలను పొడి చేసుకుని కొద్దిగా నూనె కలిపి ఇడ్లీ, దోసె వంటి వాటికి సైడ్‌డిష్‌గా తింటే మేలు చేస్తుంది. ఆవాల పొడికి ఉల్లి ముక్కలు, అల్లం పేస్ట్, ఉప్పు, చిటికెడు పసుపు వేసి వేయించి తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంచవచ్చు.
ఆవాల పొడిని రోజుకు మూడు పూటలా స్పూన్ మోతాదులో తీసుకుంటే రక్తంలోని షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఆవాలలోని విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో దోహదపడతాయి. శరీరానికి అవసరమైన పోషక విలువలను అందించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ఆవాలను నెయ్యిలో వేయించి అందులో కొద్దిగా ఉప్పు, కరివేపాకు చేర్చి పొడిలా చేసుకుని తింటే మధుమేహం అదుపులో వుంటుంది. కప్పు పెరుగులో కొద్దిగా ఆవాల పొడి, ఉప్పు, కొత్తిమిర వేసి తింటే రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. తరచుగా ఆవాలతో చేసిన ఆహార పదార్థాలు తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలైనా తొలగిపోతాయి.