బీన్సులో వుండే పోషకాలు ఏమిటో తెలుసా?

మంగళవారం, 9 జూన్ 2020 (21:59 IST)
భయంకరమైన ఆరోగ్య సమస్యలకి, వాటికి కారణమయ్యే కొలెస్ట్రాల్‌ని ఎదుర్కొనే శక్తి బీన్సులో పుష్కలంగా ఉందని, బీన్సులో ఉండే పోషకాలు ఆరోగ్యాన్ని రక్షిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఒక కప్పు బీన్సును ఉడికించి తీసుకుంటే ఆరువారాల పాటు పదిశాతం కొలెస్ట్రాల్‌ను బీన్సు తగ్గిస్తుందని పరిశోధనలో తేలాయట. వారంలో నాలుగురోజుల పాటు మన ఆహారంలో బీన్సును చేర్చి తినడం వల్ల గుండె నొప్పిని తగ్గించవచ్చట. డెబ్బై శాతం వరకు గుండె జబ్బులను తగ్గించుకోవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు.
 
ఐరన్, విటమిన్లు, మినరల్స్ ఉన్న బీన్సును తినడం వల్ల ఐరన్ లోపం నివారణ జరిగి అనీమియా రాకుండా అడ్డుకొంటుందట. అంతేకాకుండా మలబద్దకంతో బాధపడే వారికి బీన్సు మంచి మందుగా పనిచేస్తుందట. కార్బోహైడ్రేట్లు అధికంగా బీన్సులో ఉండటం వల్ల కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు