భోజనానికి ముందు నీరు తాగడం వలన భోజన సమయంలో తక్కువగా తినాలనిపిస్తుంది. తద్వారా ఆకలి నియంత్రణ ఉండదు. దీని కారణంగా బరువు పెరిగే ప్రమాదం కూడా ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కనుక భోజనాంతరం తరువాత నీరు ఎక్కువగా తీసుకుంటే అధిక బరువును తగ్గించవచ్చును. ఒక రోజుకు కనీసం 4 లీటర్ల కంటే ఎక్కువగా నీరు తాగాలి. ఇలా తాగడం వలన శరీరంలో టాక్సిన్స్ బయటకు నెట్టివేయబడుతాయి.
చాలామందైతే ఏదో నీరు తాగాలని తాగుతుంటారు. మరికొందరైతే అసలు నీళ్లే తీసుకోరు. ఇంకా చెప్పాలంటే.. చాలామంది భోజనం చేసిన అరగంటకో లేదా గంట తరువాతో నీరు తాగుతుంటారు. ఇలా చేస్తే తిన్న ఆహరం జీర్ణం కాకుండా.. కడుపు ఉబ్బరం, అజీర్తి, కళ్లు తిరగడం, వాంతులు, తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.