తాంబూలంలో జాజికాయను వేసుకుని సేవిస్తే నోటి దుర్వాసన పోతుంది.
పాలలో జాజికాయ పొడిని కలుపుని తాగితే గుండెల్లో నొప్పి, దడ తగ్గుతాయి.
గోరువెచ్చని పాలల్లో కొద్దిగా జాజికాయ పొడిని కలుపుకుని తాగితే చర్మం ముడతలు పడవు.
జాజికాయ అధిక దాహాన్ని అరికట్టడమే కాకుండా అలసటవల్ల వచ్చిన జ్వరాన్ని తగ్గిస్తుంది.
జాజికాయను తీసుకుంటే దగ్గు, జలుబు, కఫానికి ఔషధంగా పనిచేస్తుంది.
మోతాదుకు మించి జాజికాయను ఉపయోగించడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు రావచ్చు.
జాజికాయ వాడకం విషయంలో జాగ్రత్త వహించడం ముఖ్యం, గర్భవతులు దీన్ని ఉపయోగించకూడదు.
చిట్కాలు ఆచరించే ముందు వైద్యుడిని సంప్రదించాలి.