పాలు కలపని బ్లాక్ టీని తాగితే..?

ఆదివారం, 25 నవంబరు 2018 (15:24 IST)
పాలు కలపని బ్లాక్ టీని తాగితే మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు. బ్లాక్ టీ సేవించే వారిలో డయాబెటిస్ టైప్-2 వచ్చే అవకాశాలు చాలామటుకు తగ్గిపోతాయని తాజా అధ్యయనంలో తేలింది. బ్లాక్ టీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఔషధమని వైద్యులు చెప్తున్నారు. 
 
బ్లాక్ టీలో వున్న టానిన్స్ జీర్ణక్రియకు ఎంతగానో దోహదం చేస్తాయి. ఇవి జీర్ణాశయాన్ని శుభ్రపరుస్తాయి. పలురకాల టాక్సిన్లను తొలగిస్తుంది. బ్లాక్ టీని నిత్యం తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా వుంటారు. ఒత్తిడి, ఆందోళన సమస్యలు దూరమవుతాయి. 
 
హృద్రోగ సమస్యలున్నవారు నిత్యం బ్లాక్ టీ తాగితే మంచిది. ఆరోగ్యంగా వున్నవారూ బ్లాక్ టీ తాగినా గుండె జబ్బులు రావు. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే గుణాలు బ్లాక్ టీలో వున్నాయి. 
 
బ్లాక్ టీ తాగడం వల్ల ఒబిసిటీని దూరం చేసుకోవచ్చు. చర్మ సమస్యలను బ్లాక్ టీ తగ్గిస్తుంది. బ్లాక్ టీలోని యాంటీయాక్సిడెంట్లు పలు రకాల క్యాన్సర్లను రాకుండా అడ్డుకుంటాయి. క్యాన్సర్ కణతులను వృద్ధి చెందనీయవని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు