మీ బ్లడ్‌ గ్రూప్‌కు సంబంధించిన ఆహారం.... ఏంటో తెలుసా?

మంగళవారం, 5 ఏప్రియల్ 2016 (10:55 IST)
మన శరీరానికి తగ్గట్టు మన ఆహారం లేదా ఆరోగ్యానికి తగ్గట్టు ఆహారం తీసుకోవాలని అందరూ అనుకుంటారు. కానీ వీటికంటే కూడా మనిషి శరీరంలో ఉండే రక్తం గ్రూపును బట్టి ఆహారాన్నితీసుకోవాలంటున్నారు వైద్యులు. వివిధరకాల బ్లడ్ గ్రూపులవారు, తాము తీసుకోవాల్సిన ఆహారం గురించి తెలిపారు. ఇది డైటింగ్ ప్రోగ్రాం లేక్టిన్ థియరీపై ఆధారపడివుంది. క్రింద తెలిపిన ఆహార పట్టికననుసరించి ఆహారం తీసుకుంటే అధిక బరువు, ఊబకాయంలాంటి దరిచేరవని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే డైటింగ్ చేయాల్సిన అవసరంకూడా లేదంటున్నారు. 
 
మీ బ్లడ్ గ్రూపు ఓ పాజిటివ్ అయితే మీరు మాంసం, చేపలు, కాయగూరలు తీసుకోవాల్సివుంటుంది. 
 
మీ బ్లడ్ గ్రూపు బి పాజిటివ్ అయితే మీరు మాంసం, చేపలు, పాలు, పెరుగు, పాలతో చేసిన పదార్థాలు తీసుకోవాల్సివుంటుంది.  
 
మీ బ్లడ్ గ్రూపు ఏ అయితే మీరు భోజనంలో ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాల్సివుంటుంది. బ్రెడ్, నూడుల్స్, చైనీస్‌ఫుడ్స్, డిన్నర్‌రోల్, బర్గర్ తీసుకోవాల్సివుంటుంది. 
 
మీ బ్లడ్ గ్రూపు ఏబి పాజిటివ్ అయితే మీరు ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లున్న ఆహారం తీసుకోవాల్సివుంటుందని వైద్యులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి