ఉదయం అల్పాహారం తీసుకుంటుంటే శరీరంలో మెటబాలిక్ స్థాయి పెరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోను అల్పాహారం మానకండి. అల్పాహారంలో పండ్లు, బ్రెడ్ ముక్కలు తీసుకోవచ్చు. వీటితోపాటు ఓట్ మిల్క్ తీసుకోవడం కూడా ఆరోగ్యానికి ఎంతో లాభదాయకం. ఉడకబెట్టిన కోడిగుడ్డును ఉదయంపూట తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.