బ్రౌన్ రైస్‌ను ఉడికించి తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు. ఇది శరీరంలోని చక్కెర స్థాయుల్ని స్థిరీకరించడంలో ఎంతగానో తోడ్పడుతుంది. తెల్ల బియ్యంతో పోల్చితే, నెమ్మదిగా చక్కెర విడుదలలో సహాయపడే కార్బోహైడ్రేట్‌గా బ్రౌన్ రైస్ ఉపయోగపడుతుంది. ఊబకాయాన్ని ఎదుర్కొంటున్న వారికి బరువు నియంత్రణలో బ్రౌన్ రైస్ వాడకం ఎంతో ఉపయెగపడుతుంది.
బ్రౌన్ రైస్ తీసుకోవడం ద్వారా కొవ్వు శాతం తగ్గుతుంది. ఆరోగ్యకరమైన బ్రౌన్ రైస్ అల్జీమర్స్ వ్యాధిని నివారిస్తుంది. ముఖ్యంగా మహిళల్లో ఒత్తిడి తగ్గాలంటే బ్రౌన్‌రైస్‌ను ఉపయోగించాలి. మానసిక అనారోగ్యం, నిరాశ, అలసటను తగ్గించడంలో బ్రౌన్ రైస్ ఎంతగానో తోడ్పడుతుంది. బ్రౌన్ రైస్ హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది. ఇది నరాల ఒత్తిడిని తగ్గించి నిద్రబాగా పట్టేందుకు సహాయపడుతుంది.
ఇంకా బ్రౌన్ రైస్ ఎముకలకు బలాన్నిస్తుంది. ఇది కాల్షియంతో, ఎముకల భౌతిక నిర్మాణానికి తోడ్పడుతుంది. బ్రౌన్ రైస్, విటమిన్లు, ఖనిజాలు, శరీర రోగనిరోధక వ్యవస్థను పెంచడానికి అవసరమైన ధాతువులను కలిగివుంటుంది. దీంతో అనారోగ్య సమస్యలను నివారించేందుకు ఇది చాలా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.