బ్రౌన్ రైస్ తీసుకుంటే ఎంత మేలో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. ఎర్రబియ్యం డయాబెటిస్‌కు దివ్యౌషధంగా పనిచేస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ తగ్గితే ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అవుతుంది. అది సరిగా ఉత్పత్తి అయితే షుగర్ వ్యాధి వచ్చే సమస్య ఉండదు. అందువల్ల డయాబెటిస్ కంట్రోల్‌లో ఉండాలంటే ఎర్ర బియ్యం తీసుకోవాల్సిందే.
శ్వాస సమస్యలను ఎర్రబియ్యం దూరం చేస్తుంది. బ్రౌన్‌రైస్‌లో కాల్షియం, మాంగనీస్ ఉంటాయి. అవి ఎముకల్ని పుష్టిగా, గట్టిగా, బలంగా, పటిష్టంగా మార్చేస్తాయి. ఎముకలకు సంబంధించి వ్యాధులను బ్రౌన్ రైస్ నయం చేస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.