మిరపకాయల్లో గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గించే క్యాప్‌సేసియన్ అనే పదార్థం ఉంటుందని.. తద్వారా గుండెకు రక్షణ కలుగుతుందని పరిశోధకులు చెప్తున్నారు. అందుకే మనం తీసుకునే ఆహారంలో వారానికి నాలుగు లేదా ఐదు సార్లైనా మిరపకాయలను డైట్‌లో చేర్చుకోవాలి. వీటిని తీసుకుంటే.. గుండె పోటు ముప్పు 40 శాతం తగ్గుతుందని పరిశోధకులు చెప్తున్నారు.