మిరపకాయను తింటే ఎంత లాభాలో తెలుసా?

శనివారం, 1 ఆగస్టు 2020 (18:59 IST)
మిరపకాయను రోజూ ఆహారంలో చేర్చుకుంటే ఎంత మేలు జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. మిరపకాయలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా గుండె సంబంధిత సమస్యలు వుండవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
మిరపకాయలు ఎక్కువగా తీసుకుంటే గుండెపోటు రాకుండా చాలామటుకు తగ్గించుకోవచ్చు. అందుచేత రోజుకు రెండేసి మూడేసి మిరపకాయలను వంటల్లో తప్పక చేర్చుకోవాలి. మిరపకాయల్లో గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గించే ''క్యాప్‌సేసియన్‌'' అనే పదార్థం ఉంటుందని దీని వల్ల గుండెకు రక్షణ కలుగుతోందని తాజా పరిశోధనలో తేలింది. 
 
భోజనంలో భాగంగా వారానికి నాలుగుసార్లు మిరపకాయలు తింటే గుండె పోటు ముప్పు 40 శాతం తగ్గుతుందని తాజా అధ్యయనంలో వెల్లడి అయ్యింది. మిరపలో యాంటీఆక్సిడెంట్లు, జీరో కేలరీలు ఉంటాయి. కారం తినడం వల్ల జీర్ణక్రియ కనీసం 50 శాతం మెరుగుపడుతుంది. ఇది వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 
 
మిరపకాయలు ఆహారాన్ని వేగంగా జీర్ణం చేయడానికి సహాయపడతాయి. కాబట్టి వేగంగా బరువు తగ్గడానికి మంచి, సులభమైన మార్గం మిరపకాయల్ని తినడమేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు