గోరు చిక్కుడులో పోషకాలు పుష్కలంగా వున్నాయి. ప్రొటీన్లు, కొవ్వు, క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్-ఎ, సి, కెలు వున్నాయి. కొవ్వును కరిగించడానికి సహాయ పడుతుంది. ఇందులో పీచు అధికంగా వుండటంతో ఒబిసిటీ దూరం అవుతుంది. అలాగే కొలెస్ట్రాల్ సమస్యలను తగ్గిస్తుంది. మధుమేహ పీడితుల్లో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. దీంతో ఎముకలకు బలం.