పెరుగు తింటే డిప్రెషన్ తగ్గిపోతుందట. ఇందులో ఎక్కువగా ఉండే లాక్టోబాసిల్లిస్ అనే బ్యాక్టీరియా ఒత్తిడిని, డిప్రెషన్‌ను తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. పెరుగులో ప్రోటీన్లు, ఖనిజ లవణాలు, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.
బరువు తగ్గాలనుకునే వారికి పెరుగు దివ్యౌషధం లాంటిది. రాత్రి పూట అన్నంలో పెరుగును చేర్చి.. ఉదయం కొత్తిమీర, ఉల్లిపాయ కలిపి తినడం వల్ల బక్కపలచగా ఉన్న వారు పుష్టిగా తయారవుతారు. జీర్ణశక్తి పెరుగుతుంది. అంతేకాదు శరీరానికి కాంతినిస్తుంది. ఇక గర్భిణులకు చాలా మంచిది. కానీ అధికంగా తీసుకుంటే వాతం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకే రోజుకో కప్పు చొప్పున పెరుగును మధ్యాహ్నం పూట భోజనంలో చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉంటారని వారు సూచిస్తున్నారు.