పెరుగులో కీలక పోషకాలు, విటమిన్లున్నాయి. క్యాల్షియం, విటమిన్ బిలు పెరుగులో వున్నాయి. పెరుగు నరాల బలహీనతను దూరం చేస్తుంది. చర్మ వ్యాధులకు చెక్ పెడుతుంది.
శరీరానికి చలవనిచ్చే పెరుగును రోజూ తీసుకోవడం ద్వారా అజీర్తి వుండదు. పాలలో లాక్టోన్ వుంది. పెరుగులో లాక్టోపసిల్ వుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. ఉదర సంబంధిత రుగ్మతలను తొలగిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. చర్మకాంతిని పొందేందుకు, చర్మ సమస్యలను చెక్ పెట్టేందుకు పెరుగు, మజ్జిగ భేష్‌గా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
రోజూ పెరుగు తినడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. పలు అనారోగ్య సమస్యలు కూడా దరి చేరవు. పాలలో ఉండే ప్రోటీన్స్ కంటె పెరుగులో ఉండే ప్రోటీన్స్ వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. శరీరానికి పెరుగు ద్వారా ఫాస్పరస్, విటమిన్-డి అందుతాయి.