చక్కెర ఆరగిస్తే మధుమేహ వ్యాధి వస్తుందా?

బుధవారం, 14 జూన్ 2023 (15:55 IST)
దేశంలో చక్కెర వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు. ప్రపంచ మరణాల్లో అత్యధికంగా డయాబెటిక్ వ్యాధివల్లే సంభవిస్తున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే, ఈ మధుమేహం వ్యాధి ఎక్కువగా తీపి పదార్థాలు తినే వాళ్లకు వస్తుందనేది అపోహ ఉంది. కానీ, వైద్యులు కొట్టిపారేస్తున్నారు. ఇది కేవలం అపోహ మాత్రమేని చెపుతున్నారు.
 
నిజానికి చక్కెర తినడం వల్ల మధుమేహుల్లో చక్కెర నియంత్రణలో ఉండదు. కుటుంబ చరిత్రలో మధుమేహం లేకపోయిన చక్కెర ఎక్కువగా తినడం వల్ల మధుమేహం వచ్చే అవకాశాలు 30 నుంచి 40 శాతం మేరకే ఉంటాయని తెలిపారు. ఇందుకు కారణం చక్కెర ద్వారా అధిక క్యాలరీలు శరీరంలోకి చేరుతూ శరీరం బరువు పెరిగి 'ఇన్సులిన్ రెసిస్టెన్స్'కు గురికావడమేనని తెలిపారు. దీని వల్ల మధు మేహం సమస్య మొదలవుతుందని తెలిపారు., అందువల్ల 
 
జన్యుపరంగా సంక్రమించే సమస్య ఇది. కాబట్టి తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ఈ సమస్య ఖచ్చితంగా రాదు అని చెప్పడానికి వీల్లేదు. అయితే ఎప్పుడు ఈ సమస్య బారిన పడతాం అనేది, మనం అనుసరించే జీవనశైలి మీదే ఆధారపడి ఉంటుంది. కుటుంబ చరిత్రలో మధు మేహం ఉన్నప్పటికీ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తే, ఈ సమస్య కాస్త ఆలస్యంగా 50 నుంచి 60 ఏళ్ల వయసులో తలెత్తే అవ కాశాలుంటాయి.
 
కుటుంబ చరిత్రలో మధుమేహం లేనంత మాత్రాన ఆ సమస్య బారిన పడే అవకాశాలు పూర్తిగా ఉండవని చెప్పడానికి వీల్లేదు. కుటుంబ చరిత్రలో షుగర్ ఉండీ, జీవనశైలి కూడా అస్త వ్యస్థంగా ఉండీ, ఆహారం మీద నియంత్రణ లేకపోవడం, విపరీతమైన ఒత్తిడికి లోనవడం, వ్యాయామం చేయకపోవడం, నిద్రవేళలు గతి తప్పడం లాంటివి కూడా తోడైతే, 35 నుంచి 40 ఏళ్లకే ఈ రుగ్మత బారిన పడతాం. నిజానికి 20 నుంచి 30 ఏళ్ల క్రితం ఈ పరిస్థితి ఉండేది కాదు. అప్పట్లో ఆరోగ్యకరమైన జీవనవిధానం, ఆహారపుటలవాట్ల వల్ల 50 ఏళ్లు పైబడిన వాళ్లకే మధుమేహం వస్తూ ఉండేది. అలాగే కొవిడ్ సమయంలో స్టీరాయిడ్ల వాడకం ఇపుడు ఈ వ్యాధిబారినపడే వారి సంఖ్య పెరిగిపోయింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు