ఎప్పుడు పడితే అప్పుడు తినడం.. మంచి అలవాటా?

శనివారం, 22 అక్టోబరు 2022 (22:33 IST)
ఎప్పుడు పడితే అప్పుడు తినడం.. సరైన నిద్రలేకపోవడం కారణంగా మధుమేహం తప్పదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అదీ రాత్రి పూట వేళ తప్పి భోజనం చేయడం.. రాత్రి పది, 11 గంటలకు ఆహారం తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెరశాతం పెరగటంతో పాటు కొవ్వుపదార్థాలు పెరిగి గుండె సమస్యలూ సంభవిస్తాయి
 
వీటితో పాటు మెదడుపై లేట్‌నైట్‌ ఫుడ్‌ అధిక ప్రభావం చూపుతుంది. నగర జీవులు ఎక్కువగా రాత్రి పది దాటిన తర్వాత కూడా ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారం, స్నాక్స్‌ తీసుకుంటుంటారు. 
 
అలాగే పది దాటిన తర్వాత డిన్నర్ తీసుకుంటూ వుంటారు. అంతేగాకుండా తదేకంగా టీవీ చూస్తూ, సెల్‌ఫోన్‌లో నెట్‌ సర్ఫ్‌ చేస్తూ చిరుతిళ్లు తమకు తెలీకుండా బాగా లాగిస్తుంటారు. ఇలా కేవలం టైంపాస్‌ కోసం రాత్రిపూట తినే చిరుతిళ్లు, జంక్‌ఫుడ్‌ మెదడుపై అధిక ప్రభావాన్ని చూపిస్తాయని వైద్యులు చెప్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు