నీళ్లను నిలబడి తాగితే.. ఇన్ఫెక్షన్లు తప్పవట..

గురువారం, 23 మే 2019 (18:39 IST)
మనకు దాహం వేస్తే నీరు త్రాగుతాం కానీ ఎలా త్రాగాలో చాలా మందికి తెలియదు. ఎక్కువ మంది నిల్చుని నీళ్లు త్రాగుతారు. కానీ ఇది చాలా అనర్థాలకు దారి తీస్తుంది. కూర్చుని త్రాగడం ఎంతో ఉత్తమం. అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు. 
 
శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం నిల్చుని నీరు త్రాగితే వ్యాధుల భారిన పడక తప్పదు. ఎందుకుంటే నిలబడి త్రాగిన నీరు ఒక్కసారిగా ఆహార గొట్టం ద్వారా జీర్ణాశయంలోకి వెళ్తుంది. దీంతో అజీర్తి, అసిడిటీ ఇతర సమస్యలు వస్తాయి. 
 
అదేవిధంగా కిడ్నీలకు కూడా నీరు అందదు. ఇది మూత్రాశయ సమస్యలు, కిడ్నీల్లో రాళ్లు, ఇన్ఫెక్షన్ సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. 
 
ద్రవాల సమతుల్యత దెబ్బతిని కీళ్ళలో ఎక్కువ ద్రవాలు చేరడం వలన ఆర్థరైటీస్, కీళ్ళవాతం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా నీటిని నిలబడి తాగొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ప్రశాంతంగా కూర్చుని త్రాగితే అది మన ఆరోగ్యానికే మంచిది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు