శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను తేనె అందిస్తుంది. అనేక ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు తేనెలో ఉండడం వల్ల అది శరీరంలో రోగ నిరోధకశక్తిని పెంచి, బలాన్ని ఇస్తుంది.
తేనె, ఎండు ఖర్జూరం మిశ్రమం తినడం వల్ల దగ్గు, జలుబు వంటి శ్వాస సమస్యలు పోతాయి. జ్వరం తగ్గుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి రెట్టింపు అవుతుంది. దీంతో ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు రావు.