అరగుప్పెడు వేరుశెనగతో గుప్పెడు గుండె సురక్షితం..

సోమవారం, 24 ఆగస్టు 2015 (15:51 IST)
నేటి ఆధునిక యుగంలో ఉదయం నిద్ర మేల్కొన్నప్పటి నుంచి రాత్రి పడకెక్కేంత వరకు ఉరుకులు పరుగులే తీస్తుంటారు. తద్వారా టెంక్షన్.. టెంక్షన్.. ఈ కారణంగా గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రతి రోజూ అరగుప్పెడు వేరుశెనగలు తింటే చాలు. గుండెకు సంబంధించిన సమస్యలు ఏవీ దరిచేరవు.

అంతేకాకుండా రోజూ కొద్ది పరిమాణంలో వేరుశెనగలు తినడం వలన కేన్సర్, డెమెన్షియా, డయాబెటిస్, వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని, తద్వారా ఎలాంటి అనారోగ్యాలు రావు.
 
రోజూ వేరుశెనగలు తినడం ద్వారా దీర్ఘాయువు పొందేందుకు వీలు ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేరుశెనగల వలన నాడీ క్షీణత సంబంధిత వ్యాధులు, ఉబ్బసం వంటి శ్వాసకోశ వ్యాధులతో బాధపడే అవకాశాలు కూడా గణనీయంగా తగ్గుతాయని వారు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి