చెడు కొలెస్ట్రాల్‌ను యాలకులు దూరం చేస్తాయా?

గురువారం, 16 మే 2019 (16:24 IST)
మనం నిత్యం ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో యాలకులు ఒకటి. ఇవి తింటే నోటి దుర్వాసన పోయి శ్వాస కూడా తాజాగా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న ఉపయోగాలతోపాటు యాలకుల వలన ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. 
 
యాలకులు జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి. యాలకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ప్రోటీన్స్ వంటి పదార్థాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. పలు రకాల క్యాన్సర్‌లను యాలకులు నివారిస్తాయి. 
 
ఆస్తమా వ్యాధితో బాధపడేవారికి ఇది చాలా మంచి మందు. ఊపిరితిత్తుల నిండా గాలిని ధారాళంగా పీల్చుకునేందుకు యాలకులు సహాయపడతాయి. ఊపిరితిత్తుల్లోని ఇన్‌ఫెక్షన్‌లను నయం చేస్తాయి. ఒత్తిడిని, అలసటను దూరం చేయడంలో యాలకులు చక్కగా పనిచేస్తాయి. 
 
డయాబెటిస్‌ని అదుపులో ఉంచుతాయి. అధిక రక్తపోటును నియంత్రిస్తాయి. రక్తంలోని గడ్డలను నివారించి రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తాయి. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చూస్తాయి, పక్షవాతం, ఛాతీ మంట, చర్మ వ్యాధులు వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు