ఆహారం ఆరోగ్యానికి ఔషధం లాంటిదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. కాబట్టి, మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ శ్రద్ధ వహించాలి. సాధారణంగా, ఉదయం వేళ కంటే మధ్యాహ్నం పూట తీసుకునే ఆహారంపై ఎక్కువ దృష్టి పెట్టాలి. మధ్యాహ్నం పూట సూప్స్ తీసుకోకూడదు.
సూప్ రకాలు : మధ్యాహ్నం సమయంలో సూప్ రకాలను తీసుకోకపోవడం మంచిది. కారణం, సాధారణంగా సూప్ రకాలు తీసుకుంటే భోజనం ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. సూప్స్ ఆకలిని పెంచేస్తాయి. దీంతో ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు. తద్వారా బరువు పెరిగిపోతారు.
బర్గర్ : బర్గర్ వంటి స్నాక్ రకాల ఆహారాలను చాలా మంది ఎక్కువగా ఇష్టపడతారు. ఇది అనారోగ్యానికి కారణం అవుతుందిద. ముఖ్యంగా, బర్గర్, పిజ్జా వంటి ఆహారాలను మధ్యాహ్నం సమయంలో తింటే కొవ్వు శాతం పెరిగిపోతుంది.