మనిషి శరీర భాగాల్లో పాదాలు కూడా ముఖ్యమైనవి. ఈ పాదాలు మనిషి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతాయి. ముఖ్యంగా, ఒక చోటు నుంచి మరోచోటకు వెళ్లేందుకు ఎలాంటి ఇంధనం లేకుండా హాయిగా నడిచి వెళ్లొచ్చు. ఇలాంటి పాదాల గురించి మీరు తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది.
ఒక పాదంలో 23 ఎముకలు, 32 కీళ్లు, 107 లింగమెంట్స్, 19 కండరాలు ఉంటాయి. అందుకే అడుగు సరిగ్గా వేయకుంటే వీటిలో ఏదో ఒకటి దెబ్బతినే అవకాశం ఉంది. రెండు పాదాల్లో కలిసి 2.50 లక్షల శ్వేద గ్రంధులు ఉంటాయి. వీటి ద్వారా రోజుకు 200 మిల్లీ లీటర్ల చెమట ఉత్పత్తి అవుతుంది.