నెయ్యి తీసుకుంటే.. కొలెస్ట్రాల్ తగ్గుతుందట...

బుధవారం, 31 జనవరి 2018 (12:07 IST)
నెయ్యిని పెద్దలతైతే ఒక స్పూన్ పిల్లలైతే రెండు స్పూన్ల మేర ఉపయోగించవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. నెయ్యి అధిక శక్తిని ఇస్తుంది కాబట్టి.. తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. నెయ్యిలో వుండే విటమిన్ ఎ, డి, ఇ, కె వంటివి చర్మానికి.. ఎముకలు, కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి జీవక్రియను మెరుగుపరుస్తాయి. 
 
శరీర వేడిని నియంత్రించే శక్తి నెయ్యికి వుంది. కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. శరీరంలో వుండే కొవ్వును సమంగా వుంచుతుంది. నెయ్యిలో వుండే ధాతువులు, కొవ్వు ఆమ్లాలు పెద్ద పేగుకి మేలు చేస్తాయి. జీర్ణకోశానికి నెయ్యి మేలు చేస్తుంది.
 
నెయ్యి స్మోక్ పాయింట్‌ను కలిగి వుంటుంది. దీనిని వేడిచేసినా రసాయనాలను విడుదల చేయదు. కానీ ఇతర నూనెలను అతిగా వేడి చేస్తే కొన్ని రసాయనాలు విడుదలయ్యే ఛాన్సుంది. అందుకే నెయ్యితో ఇబ్బంది వుండదంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. 
 
నెయ్యిలో విటమిన్ కె2, యాంటీయాక్సిడెంట్లు, యాంటీ-వైరల్ ధాతువులున్నాయి. నెయ్యి క్యాన్సర్ కణాలపై పోరాడుతుంది. కోపాన్ని అదుపులో వుంచి బీపీని నియంత్రిస్తుంది. నెయ్యిని వేపుళ్లలో వుపయోగించుకోవచ్చునని.. తద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ శాతం ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు