సాధారణంగా ద్రాక్షలను తీసుకుంటే.. మధుమేహం, గుండెపోటు, క్యాన్సర్ లాంటి వ్యాధులు దరిచేరవు. ఆకుపచ్చ ద్రాక్షలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లను ఫ్లేవనాయిడ్లు అంటారు. వీటికి కూడా ఎర్రద్రాక్షల్లోని యాంటీ ఆక్సిడెంట్లకు ధీటుగా పనిచేసే శక్తి ఉంది. భావోద్వేగాలను నియంత్రించడంలో, మెదడు పనితీరును ప్రభావితం చేయడంలో ఉపకరించే విటమిన్ బీ6 ద్రాక్షలో అధికం.
మధుమేహం ఉన్నవారు రోజుకు పది గ్రాముల కన్నా తక్కువగా ద్రాక్షలను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వైట్ బ్రెడ్, తెల్ల బియ్యం, తదితర పదార్థాలతో పోల్చినపుడు ఇది మధుమేహ నియంత్రణలో మెరుగైన ఫలితాలనిస్తాయి. కాబట్టి మధుమేహ రోగులు ఎండు ద్రాక్షను చిరుతిండిగా తీసుకోవడం మంచిదేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.