పోషకాలు నిండుగా ఉండే పెసలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని మొలకల్లా చేసి తింటే మరి మంచిది. శరీరభాగాలను సంరక్షించడంలో పెసలు అద్భుతంగా పనిచేస్తాయి. కాపర్ కూడా అధికంగా ఉండే పెసలను తినడం ద్వారా చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. మొలకెత్తిన గింజల్లో సమృద్ధిగా అమైనో ఆమ్లాలు ఉంటాయి. శరీరంలో వ్యాప్తి చెందే క్యాన్సర్ కణాలను ఇవి నిరోధిస్తాయి.