జామపండును రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బాగా మాగిన జామపండు గుజ్జులో కొద్దిగా తేనెను కలిపి తింటే మంచి ఎనర్జీ వస్తుంది. ఉదయం, రాత్రి వేళల్లో భోజనానంతరం జామపండు తింటే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. దీంతోపాటు మానసిక ఒత్తిడి కూడా దూరమవుతుంది. రోజూ ఒక జామకాయ తింటే ప్రొస్టేట్ క్యాన్సర్‌ను అరికట్టవచ్చు.
పచ్చి జామకాయ తింటే చిగుళ్లు, దంతాలు గట్టిపడతాయి. ఇందులో విటమిన్ సి అధికంగా ఉండటంతో చిగుళ్ల నుంచి రక్తస్రావం ఆగుతుంది. పచ్చి జామకాయ ముక్కలను ఒక కప్పు తీసుకుని, బాగా ఎండబెట్టి, దానికి అర చెంచా మిరియాలు, అర చెంచా సైందవ లవణాన్ని వేసి మెత్తగా పొడిచేసి సీసాలో నిల్వ చేసుకోవాలి. దానిని ప్రతిరోజూ పళ్లపొడిలా వాడితే దంతాలు గట్టి పడటమే కాకుండా చిగుళ్ల సమస్యలు దూరమవుతాయి.
జామపండు గుజ్జులో పాలు తేనె కలిపి తీసుకుంటే విటమిన్-సి, కాల్షియం తగినంతగా లభిస్తాయి. ఎదిగే పిల్లలకు గర్భిణులకు ఇది టానిక్‌లా పనిచేస్తుంది. జామపండు చర్మాన్ని కూడా పదిలంగా ఉంచుతుంది. జుట్టు రాలిపోకుండా నివారిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ కంటికి మేలు చేస్తుంది. చూపు కోల్పోకుండా కాపాడుతుంది.