కాకరకాయ చేదుగావున్నా...బోలెడంత ఉపయోగం !!

శనివారం, 13 ఫిబ్రవరి 2016 (09:14 IST)
కాకరకాయ పేరు వింటేనే చాలామందికి నచ్చదు. ఎందుకంటే ఇందులోవున్నంత చేదు మరెందులోను ఉండదు. కాని ఈ చేదు వెనుక చాలా ఔషధ గుణాలున్నాయని ఎవరు గుర్తించరు. కాకరకాయలో ఫాస్ఫరస్ అధికమోతాదులో ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు వైద్యులు.
 
కడుపులో గ్యాస్ ఉంటే కాకరకాయ రసాన్ని సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. 
కఫాన్ని దూరం చేస్తుంది. కడుపులోని నులిపురుగులను నశింపజేస్తుంది.
కాకరకాయ జీర్ణక్రియను సక్రమంగా ఉంచుతుంది.
మధుమేహంతో బాధపడే వారు కాకరకాయ రసాన్నిసేవిస్తుంటే ఉపశమనం కలుగుతుంది.

వెబ్దునియా పై చదవండి